చెన్నై లో అటు పిల్లలకు, ఇటు పెద్ద వారికీ సరదా కలిగించే కాలక్షేపాలతో వుండేది కిష్కింద థీమ్ పార్క్. ఈ పార్క్ ను తాంబరం రైల్వే స్టేషన్ కు దగ్గరలో నిర్మించారు. ఈ పార్క్ ప్రశాంతతను కాపాడడానికి కొంచెం దూరంగా ఏర్పాటు చేసారు. ఈ పార్కు దక్షిణం వైపు అనకపుతూర్ 13 కిలోమీటర్ల దూరంలో వుంది.
ఈ పార్కు అందమైన పరిసరాల వల్ల, సహజ సౌందర్యం వల్లా, పచ్చదనం వల్లా, అద్భుతమైన నీటి ఫౌంటెయిన్ల వల్ల, ప్రశాంతత వల్లా ఇది అమ్యూస్మేంట్ పార్క్ అయినప్పటికీ చాలా మంది ఇక్కడికి వారాంతానికి ఆటవిడుపుగా వస్తారు.
ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఈ ప్రదేశం అందిస్తుంది. పిల్లలు బంపర్ కార్ రైడ్లను, బంపీ కాటర్ పిల్లర్ రైడ్లను, బొమ్మ రైళ్ళు, వేవ్ పూల్స్ ను ఆస్వాదిస్తారు. పెద్ద వాళ్ళు మరింత ఉత్సుకత కలిగించే, సాహసం కలిగించే రోలర్ కోస్టర్, ట్విస్టర్, లాంటి చాలా కాలక్షేపాలు వున్నాయి. సరదా తీరాక మీకు ఆకలి వేస్తె ఇక్కడ నోరూరించే రుచులు అందించే మల్టీ-క్యూసిన్ రెస్టారెంట్ కూడా వుంది.