చిక్కమగళూరు వచ్చే సందర్వకులు కోదండ రామస్వామి దేవాలయ జాతర చూస్తారు. ఇది ప్రతినెలా ఫిబ్రవరి లో జరుగుతుంది. దీనిని మూడు దశలలో పూర్తి చేశారు. ఈ దేవాలయం హొయసల శిల్పకళలతో రూపొందించారు. సుకన్సీ, గర్భగ్రిహ మాత్రం ద్రవిడ కళా నైపుణ్యంతో నిర్మించారు. దేవాలయానికి వచ్చిన వారు ముందుగా దేవాలయ ప్రాంగణంలో ఒక పొడి సరస్సును చూస్తారు. కోదండరామస్వామి దేవాలయం ప్రవేశ భాగం 17వ శతాబ్దంలో నిర్మించారు. దాని ముఖమంటపం 16వ శతాబ్దంలో నిర్మించారు. నవగ్రహాలు 14వ శతాబ్దంలో నిర్మించారు. గర్భగ్రిహంలో హనుమంతుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలుంటాయి. ఈ దేవాలయ ప్రాకారంలో ముద్దుక్రిష్ణ, యోగనరసింహ, రామానుజాచార్య, దీక్షిక, సుగ్రీవ, వేదాంత, మాధవ చిత్రాలుంటాయి. ఇవి చాళుక్యులు మరియు హొయసలుల కాలం నాటివి. విష్ణుమూర్తి చిత్రాలు అంటే నరసింహ, వేణుగోపాల, కలియ - మర్దన, హయగ్రీవ, గోవర్దనధారి, లక్ష్మీ నారాయణ అవతారాలను సుకన్సాయి, గర్భ్ గ్రిహ వెలుపలి భాగాలలో చూడవచ్చు.



Click it and Unblock the Notifications