ఈశాన్య ప్రాంతంలోని ఇతర గిరిజన సంఘం వలెనే, చురచాన్ద్పూర్ లో ఉంటున్న గిరిజనులు వెదురు పని మరియు చేనేత వంటి హస్తకళలు, దేశీయ కళలలో ఆరితేరి ఉన్నారు. ఈ విధంగా, చురచాన్ద్పూర్ హస్తకళలు, దేశీయ కళలలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వొచ్చిన పర్యాటకులు చురచాన్ద్పూర్ బజార్లలో అమ్మే రంగుల గిరిజన కళాఖండాలను తప్పనిసరిగా కొనుక్కుంటారు.
పర్యాటకులు, న్యూ బజార్ మరియు ఓల్డ్ బజార్ మార్కెట్ ప్రదేశాల్లో వెదురు మరియు చెక్క వస్తువులను తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. ఓల్డ్ బజార్ ను జెంహంగ్ బజార్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మేవాటిలో గిరిజనుల షాల్స్, అద్భుతమైన నాణ్యత మరియు మన్నికకు ప్రసిద్ధి.
ఇక్కడి హస్తకళల మార్కెట్ లో వివిధ రకాల చేతితో తయారు చేసిన ఉత్పత్తులను చూడవచ్చు. హస్తకళ మార్కెట్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడి వొస్తువులు చాలా వరకు స్థానికులు తయారు చేసినవే. ఇక్కడి జ్ఞాపకాలు కొనుక్కోవటానికి ఈ హస్తకళ మార్కెట్ ఆదర్శవంతమైన ప్రదేశం.



Click it and Unblock the Notifications