ముట్టుకాడు బ్యాక్ వాటర్స్ లో ఎన్నో రకాల నీటి క్రీడలు జరుగుతాయి. కయకింగ్, విండ్ సర్ఫింగ్, కేనోయింగ్ వంటివి ఆచరించి ఆనందించ వచ్చు. ముత్తుకాడు గ్రామం చెన్నై నుండి 28 కి.మీ.ల దూరంలో వుంటుంది. కనుక కొవ్ లాంగ్ వెళ్ళేవారు దీనిని తప్పక సందర్సించాలి. ఈ ప్రదేశం కాలుష్య రహితంగా వుండి ఎంతో హాయి గొలుపుతుంది. ఇక్కడ కల పర్యటన అంశాలు తమిళ్ నాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించ బడతాయి. ప్రతి సంవత్సరం, ఫిబ్రవరి నెలలో ముట్టుకాడు లో విండ్ సర్ఫింగ్ వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు వచ్చే సందర్సకులలో చాలా మంది ముట్టుకాడు బ్యాక్ వాటర్స్ కు వస్తారు. ఈ ప్రదేశం వివిధ వృక్ష, జంతు జాతులతో నిండి వుంది. చక్కని పచ్చదనం పుష్కలమైన నీటి ఆనందాలు కలవు.



Click it and Unblock the Notifications