Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» డామన్ మరియు డయు

డామన్ మరియు డయ్యు టూరిజం - ప్రకృతితో సంబంధం కలిగి ఉండండి !

మీరు శెలవుల్లో ప్రకృతి సౌందర్యం మరియు సహజమైన,అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు నెలవైన ప్రదేశాలకు ప్రణాళిక వేసుకున్నట్లయితే, ఇండియాలోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ మరియు డయ్యు సందర్శించటానికి ఎంపిక చేసుకున్నట్లయితే ఆ ఎంపిక సరిఅయినది. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు 450 సంవత్సరాల క్రిందట ఈ రెండు జిల్లాలు పోర్చుగీస్ వారి భూభాగాలు మరియు 19 డిసెంబర్ 1961 లో గోవా తోపాటు భారత గణతంత్ర రాజ్యం యొక్క భాగంగా ప్రకటించారు. పురాతన కాలంలో జరిగిన ఎన్నో యుద్ధాలకు సాక్ష్యాలుగా డామన్ మరియు డయ్యు ఉన్నాయని చరిత్ర చెపుతున్నది.

ఈ రెండు జిల్లాలలో ఇంగ్లీష్, హిందీ , గుజరాతి, పోర్చుగీస్ మరియు మరాఠీ ప్రధానమైన భాషలుగా ఉన్నాయి.డామన్ టూరిజం - సంక్షిప్త చరిత్రడామన్ జిల్లా డామన్ గంగ నది సమీపంలోనే ఉన్నది. ఈ చీకు-చింత లేని జిల్లా, దానియొక్క సహజమైన అందంతో ప్రపంచంలోని సదర్శకులను ఆకర్షిస్తున్నది. ఈ ప్రాంతంలో వివిధ రకాల మతాల మరియు సంస్కృతులతో కలిసిమెలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. డామన్ జిల్లా పోర్చుగీస్ కలోనియల్ ఆర్కిటెక్చర్ తో ఉన్న చర్చులు మరియు బీచులతో ఖ్యాతి చెందింది. ఈ అద్భుతమైన ప్రాంతాన్ని కాలన పావ్రి లేక లోటస్ ఆఫ్ మార్ష్ లాండ్స్ అని పిలిచేవారు. డామన్ ప్రాంతాన్ని, డామన్ గంగ నది నాని డామన్ మరియు మోతీ డామన్ అనే రెండు పట్టణాలుగా విభజిస్తున్నది. డామన్ - సాంస్కృతిక వైవిధ్యండామన్ యొక్క పర్యాటక సాంస్కృతిక కోణం గిరిజన, పట్టణ, ఐరోపా మరియు భారతీయ సంప్రదాయాలు పరిపూర్ణ సమ్మేళనం. ఈ జిల్లా గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నది. నృత్యం మరియు సంగీతం మొదలైన కళలకు ఇక్కడి పౌరులు అత్యంతప్రాధాన్యాన్ని ఇచ్చారు.

డామన్ బీచ్ లో సూర్యస్నానం చేస్తూ, దానితోపాటు ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని అనుకుంటుంటారు. ఇటువంటి అద్భుతమైన దృశ్యాలతోపాటు , డామన్ లో నోరూరించే అక్కడి స్థానిక సముద్రపు ఆహారాన్ని దర్శకులు ఆనందిస్తుంటారు.ఇక్కడి వాతావరణం సంవత్సరమంతా అనుకూలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక డామన్ దర్శించటానికి సందర్శకులు సంవత్సరంలో ఎప్పుడైనా రావొచ్చు. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ ఉండగా,అత్యల్ప ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

ఇక్కడ వేసవిలో కూడా చల్లటి గాలులు వీస్తుంటాయి. డామన్ దర్శించటానికి సెప్టెంబర్ ప్రారంభం నుండి మే నెల ఆఖరు వరకు అనుకూలంగా ఉంటుంది.డామన్ లో మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు డామన్ పర్యాటక స్థలాలలో కొన్ని: జంపూర్ బీచ్, దేవక బీచ్, బిఒఎం యేసు చర్చ్, వైభవ్ వాటర్ వరల్డ్, సెయింట్ జేరోం ఫోర్ట్ మరియు ఇంకా ఎన్నో.డయ్యు టూరిజం - చరిత్ర లోకి ఒక లుక్ఆసక్తికరమైన చరిత్రతో మరియు శాంతియుత వాతావరణంతో, డయ్యు జిల్లా గుజరాత్ సౌరాష్ట్ర (కటియవాద్ ) ద్వీపకల్పం యొక్క దక్షిణ కొన వద్ద, అరేబియన్ సముద్రంతో చుట్టుముట్టి ఉన్నది. డామన్ లాగా, డయ్యు కూడా 1961 వరకు ఒక పోర్చుగీస్ కాలనీగా ఉన్నది. ఈ డయ్యు ప్రాంతాన్ని చరిత్రకు ముందు మరియు మధ్యయుగ కాలం నుండి అనేక రాజ్యాలు పాలించాయి. ఒక ఇరుకైన కాలువ డయ్యు ద్వీపం మరియు తీరం మధ్య విభజనను సృష్టిస్తున్నది. ఇది ఇండియాలో 9వ అతితక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం.

డయ్యు వాతావరణంఆహ్లాదకరమైన వాతావరణంతో, సహజ ప్రకృతి సౌందర్యంతో సందర్శకులకు డయ్యు ఒక నిష్కల్మషమైన మరియు రిలాక్స్డ్ స్పాట్ అని నిరూపిస్తున్నది. డయ్యులో వాతావరణం సంవత్సరమంతా అన్కూలంగా ఉండటం వలన, ఈ ప్రాంతాన్ని సందర్శకులు ఎప్పుడైనా దర్శించవొచ్చు. డయ్యులో బీచులు దర్శకులతో ఎప్పుడూ చాలా సందోహంగా ఉంటుంది.డయ్యు-అభివృద్ధి చెందుతున్న సంస్కృతిడయ్యు టూరిజం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నది మరియు ఇది కతియావాది లేదా సౌరాష్ట్ర సంప్రదాయం మరియు పోర్చుగీసు సంస్కృతుల గొప్ప కలయికతో ఉన్న సంస్కృతిని కలిగి ఉన్నది.

ఈ జిల్లా నిర్మాణంలో కూడా పోర్చుగీస్ వారి ప్రభావం ఉన్న్దనతంలో సందేహం లేదు. ఈ జిల్లా ప్రాంతంలో ప్రధానంగా హిందువులు, ముస్లింలు మరియు క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉంటున్నారు. ఆహ్మేదబాద్, రాజ్కోట్, భావనగర్ మరియు వడోదర వంటి ముఖ్య నగరాల నుండి డయ్యుకు మంచి రోడ్ మార్గాలు అనుసంధించబడి ఉన్నాయి. అందువలన సందర్శకులు సులభంగా డయ్యు చేరుకోవొచ్చు.డయ్యులో మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలుడయ్యు సందర్శించే దర్శకులు ఇక్కడి పర్యాటక ఆకర్షణలైన నగోవ బీచ్, ఘోఘ్ల బీచ్, జలంధర్ బీచ్, గంగేశ్వర్ ఆలయం, సెయింట్ పాల్ యొక్క చర్చి, సీ షెల్ మ్యూజియం, డయ్యు ఫోర్ట్ వంటి వాటిని తప్పక దర్శించితీరాలి. కంటికి ఆహ్లాదం కలిగించే నిర్మాణాలు, స్వచ్ఛమైన వాతావరణం, బీచులు మరియు ఆకుపచ్చని పొదలు డామన్ మరియు డయ్యు పర్యాటకరంగాన్ని ఎప్పుడూ ఉత్తేజంగా ఉంచుతున్నాయి.

డామన్ మరియు డయు ప్రదేశములు

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Jun,Wed
Return On
04 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
03 Jun,Wed
Check Out
04 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
03 Jun,Wed
Return On
04 Jun,Thu