నాని డామన్ కోట అని కూడా పిలవబడే సెయింట్ జెరోం ఫోర్ట్ డామన్ గంగా నది యొక్క ఉత్తర తీరంలో నాని డామన్ దగ్గరగా నెలకొని ఉంది. కొద్దిపాటి కోట ఉన్నప్పటికీ దాని ప్రవేశం కోసం నది ఎదురుగా ఒక భారీ ద్వారం ఉన్నది. ఇది 12.250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. సెయింట్ జెరోమ్ కోటకు కాతోలిక్ ఆర్డర్ నుండి పేరు వచ్చింది.
సెయింట్ జెరోమ్ ఒక భారీ విగ్రహం ద్వారంకు ఎదురుగా ఉన్నది. సముద్రం దగ్గరలో కోట, ఒక కాథలిక్ చర్చి ఉన్నాయి. సముద్ర సమీపంలో రెండు ప్రధాన ద్వారాలను కలిగి ఉన్నది. మొదటి ద్వారం దమన్ గంగ వాగుకు దూరంగా ఉన్న మోతి డామన్ ఎదురుగా ఉన్నది. మరొక ద్వారం నాని డామన్ బయటకు తెరుచుకుంటుంది.
కోట దగ్గర ఒక చేపల మార్కెట్ ను ఆసక్తికరముగా చూడవచ్చు. అలాగే చేపలు పట్టే పడవల సముదాయం సమీపంలో లంగరువేసి ఉంటాయి.