Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ధనౌల్తి

ధనౌల్తి - నిర్మలమైన వాతావరణం !

13

ధనౌల్తి సముద్ర మట్టం నుండి 2286 మీటర్ల ఎత్తులో ఉన్న ధనౌల్తి ఉత్తరాఖండ్ లో ని గర్హ్వాల్ జిల్లాలో ఉంది. ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం కలిగిన ఈ ప్రాంతం చంబా నుండి ముసోరి వెళ్ళే మార్గం లో ఉంది. ముస్సొరి కి కేవలం 24 కిలో మీటర్ల దూరం లో ఉన్నందువల్ల ఈ ప్రాంతం పర్యాటకుల లో అమితం గా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతం నుండి మంత్రముగ్ధుల్నిచేసే డూం వాలీ యొక్క అందాలను పర్యాటకులు తిలకించవచ్చు.

చుట్టూ దేవదారు వృక్షాలు కలిగిన ఎకో పార్క్ ఈ ధనౌల్తి లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. పర్యాటకులకు బస చేసే అవకాశాన్ని కల్పించే వివిధ ఎకో హట్స్(పర్యావరణ కుటిరాలు) ని ముస్సోరీ ఫారెస్ట్ డిపార్టుమెంటు అభివృద్ధి చేసింది. వీటితో పాటు, ఈ ప్రాంతం బంగాళా దుంప పంట కి ప్రాచుర్యం చెందినది కావడం వల్ల "ఆలూ ఖేట్" గా ప్రసిద్ది చెందింది. దశావతార్ టెంపుల్, న్యూ తెహ్రి టౌన్ షిప్, బరేహిపని మరియు జోరండ ఫాల్స్, డియోగర్ ఫోర్ట్ మరియు మతటిల డ్యాం వంటివి ఇక్కడికి సమీపం లో ఉన్న మరికొన్ని ప్రసిద్ద పర్యాటక ఆకర్షణలు. సందర్శకులు థంగ్ధర్ క్యాంపు లో రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, హైకింగ్ మరియు ట్రెక్కింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలలో పాల్గొనవచ్చు. ఈ క్యాంపు వసతి సదుపాయం తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు పర్యాటకులకి కల్పిస్తుంది.

వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా ధనౌల్తి కి సులభం గా చేరుకోవచ్చు. జోలీ గ్రాంట్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. డెహ్రాడున్ మరియు రిషికేశ్ లో ఉన్న రైల్వే స్టేషన్ లు ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్స్. సమీప ప్రాంతాలైన డెహ్రాడున్, ముస్సోరీ, హరిద్వార్, రిషికేశ్, రూర్కీ మరియు నైనిటాల్ నుండి ఇక్కడికి చేరుకోవడానికి బస్సు సర్వీస్ ల ని పర్యాటకులు వినియోగించుకోవచ్చు.

ధనౌల్తి ని సందర్శించాలనుకునే పర్యాటకులకి ఎండాకాలం అలాగే శీతాకాలం అనువైనవి. ఈ సమయం లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ధనౌల్తి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ధనౌల్తి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ధనౌల్తి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ధనౌల్తి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : ముస్సోరీ - చంబా రోడ్డు లో ఉన్న ధనౌల్తి ఉత్తరఖాండ్ ప్రధాన నగరాలన్నింటికి( డెహ్రాడున్, ముస్సోరీ, హరిద్వార్, రిషికేశ్, రూర్కీ మరియు నైనిటాల్) చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ మరియు చండి గర్ నుండి ముసోరీ కి చేరుకోవడానికి ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సు సర్వీస్ సదుపాయాలు పర్యాటకులు వినియోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: ధనౌల్థ్ కి 92 కిలోమీటర్ల దూరం లో రిషికేశ్ రైల్వే స్టేషన్ అలాగే 56 కిలోమీటర్ల దూరం లో డెహ్రాడున్ రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. భారత దేశం లో ని ప్రధాన నగరాల నుండి ఈ రెండు స్టేషన్ లకు రెగ్యులర్ రైళ్ళు నడుస్తూ ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ ల నుండి లభించే టాక్సీ సేవల ని వినియోగించుకుని పర్యాటకులు ధనౌల్తి కి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : ధనౌల్తి నుండి 83 కిలో మీటర్ల దూరం లో ఉన్న జోలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ అఫ్ డెహ్రాడున్ ధనౌల్థ్ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం. రెగ్యులర్ ఫ్లైట్స్ ద్వారా ఈ విమానాశ్రయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానమై ఉంది. ఈ విమానాశ్రయం నుండి ధనౌల్థ్ కి చేరుకునేందుకు టాక్సీ సేవలు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed