కాళి నది 'కాలాపానీ' వొద్ద హిమాలయాల నుండి ఉద్భవించినది. పిథొరగర్హ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3600 మీ. ఎగువన ఉన్నది. ఇక్కడ కాళి దేవాలయం కూడా ఉన్నది. ఈ నది ఇండియా మరియు నేపాల్ మధ్య సహజంగా ఏర్పడిన విభజన రేఖలాగా ఉన్నది. ఇది ఇండియాలో ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహిస్తున్నది( ఇక్కడ ఈ నది పేరు 'శారద' గా మారింది). జుల్జిబి వద్ద 'గోరి గంగ' లో కలిసి, చివరిగా పవిత్రమైన 'గంగ' నదితో కలుస్తుంది. కాళి నదిలో వివిధ ట్రాక్స్ లో 'రాఫ్టింగ్' చేస్తూ, పర్యాటకులు చాలా ఆనందిస్తుంటారు.



Click it and Unblock the Notifications