మైదం అంటే అహోం భాష లో స్మశానం లేదా సమాధి అని అర్ధం. అహోం స్వర్గో దేవ్ కాలం లో అనేక సమాధులు వెలిశాయి. వాటిలో బహిఖోవా మైదాం ప్రధానమైనది. బహిఖోవా మైదాం బహిఖోవా దసరత్ దోవేరా బోర్ఫుకాన్ పేరుతో ఏర్పడింది. బోర్ఫుకాన్ అనేది అహోం రాజులు తమ సైన్య అద్యక్షుడు కు ఇచ్చిన బిరుదు. రాజేశ్వర్ సింఘా పాలనలో బహిఖోవా దాసరత్ దోవేరా సైన్య అద్యక్షుడు. ఈ సమాధి ఖోవాంగ్ టీ ఎస్టేట్ ఆవరణ లో కలదు. అయితే ప్రస్తుతం ఇది శిధిలావస్థలో కలదు.
బహిఖోవా మైదాం పక్కనే మూడు చిన్న సమాధులు కూడా కలవు. అవి కూడా శిధిలమై వున్నాయి. ఇంకనూ అనేక శిధిల సమాధులు ఖోవాంగ్ టీ ఎస్టేట్ లో కనపడతాయి. డిబ్రూఘర్ లో బార్బరా మైదాం, సోరుమేచ్లౌ మరియు బోర్ మేచాలో మైదాం లు ప్రసిద్ధి గాంచినవి.



Click it and Unblock the Notifications