ఝార్ఖండ్ లోని దుమ్కా జిల్లలో బాబా బాసుకినాథ్ ధాం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హిందువుల పవిత్ర స్థలాలలో ఇది ఒకటి. జూలై, ఆగష్టులలో జరిగే శ్రావణ మేళకు దేశం నలుమూలల నుండి అనేక మంది భక్తులు వస్తారు. ఈ సందర్భంగా అనేక మంది విదేశీ పర్యాటకులను కూడా చూడవచ్చు. దేవునికి పవిత్ర గంగానది నీటిని సమర్పిస్తారు. భక్తులు కాషాయ వస్త్రాలలో కనబడతారు.
వారు సాష్టాంగనమస్కారాలతో దేవునికి ప్రార్ధన చేస్తారు. భక్తులు దియోఘర్ లో ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగను కూడా సందర్శిస్తారు. మరొక పండుగ ఏడాది చివరిలో జరిగే వివాహ పంచమి లేదా రామ జానకి వివాహ ఉత్సవం. దీనిని బాబా వాసుకినాథ్ ప్రారంభించగా ఇప్పటికి నిర్వహిస్తూనే ఉన్నారు. “పల్లకి ఉత్సవం” ఇక్కడి వేడుకలలో ఒక భాగం. పరమశివుని ప్రార్ధించడానికి లెక్కలేనంత మంది ప్రజలు వస్తారు.
ఇది దుమ్కా-దియోఘర్ జాతీయ రహదారిపై జసిధి దుమ్కా రైలు మార్గానికి దగ్గరగా ఉంది. అతి దగ్గరి స్టేషన్ వాసుకినాథ్, జమ్తారా రైలుస్తేషన్లు. ఒకవేళ మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లైతే, రాంచి విమానాశ్రయం అతి దగ్గరది.



Click it and Unblock the Notifications