ద్వారకాధిశ దేవాలయం నుండి 2 కిలో మీటర్ ల దూరంలో ఉన్న ఈ రుక్మిణి దేవి దేవాలయం శ్రీకృష్ణుని భార్య అయిన రుక్మిణి దేవికి అంకితం ఇవ్వబడినది. ఈ దేవాలయం బయట గజతరాస్ (ఏనుగులు) మరియు నరతరాస్ (మానవ విగ్రహాలు) లతో అందంగా చెక్కబడి ఉంటుంది.
ఒక ప్రఖ్యాత పురాణ ఇతిహాసం ప్రకారం ఒకసారి శ్రీ కృష్ణుడు, రుక్మిణి దేవి సమేతంగా దుర్వాస మహా మునిని ద్వారకకు ఆహ్వనించగా, ఆయన తనని రధం పై తామే మోసుకు వెళ్ళాలని అడిగాడట. అందుకు వారు సంతోషంగా ఒప్పుకుని, ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో ఉండగా, రుక్మిణికి దాహంగా అనిపించింది. శ్రీ కృష్ణుడు భూమి నుండి గంగా జలంను వెలుపలికి తీయగా, రుక్మిణి ఆ నీటిని దుర్వాస మునికి అందించకుండా తాగింది. తనకు నీరు కావాలేమో అని రుక్మిణి కనుక్కోకుండా తానె తాగినందుకు కోపించిన దుర్వాస ముని రుక్మిణిని తన భర్త నుండి దూరం అవుదువు అని శపించాడు. అందు వలననే ద్వరకాధిశ దేవాలయం నుండి రుక్మిణి దేవాలయం దూరంగా ఉందని కారణంగా చెప్తారు.



Click it and Unblock the Notifications