గుహ నెం.30 - ఈ గుహను ఛోటా కైలాసం అంటే చిన్న కైలాసం అని పిలుస్తారు. ఈ గుహ నిర్మాణం హిందువుల గుహ నెం. 16ను పోలి ఉండేందుకు ప్రయత్నించారు. కాని ఆ గుహలోని ఒరిజినల్ చెక్కడాల పనితనం ఇక్కడ లేకపోయింది. ఇది అసంపూర్తి నిర్మాణంగానే ఉంటుంది. జైన మత స్ధాపకుడు మహావీరుడు ఒక సింహాసనంపై కూర్చొని ఉంటాడు.
గుహ నెం.32 ఈ గుహ ఇంద్ర సభ వలే ఉంటుంది. దీనిలో జైనమత వ్యవస్ధాపకుడైన మహావీరుడిని కొలుస్తారు. ఇది ఒక రెండు అంతస్తుల గుహ. ప్రవేశం ఒక చిన్న సభా ప్రాంగణానికి దోవతీస్తుంది. ఇక్కడే ఒక అతి పెద్ద ఏక శిల దేవాలయం సరిగ్గా మధ్య భాగంలో ఉంటుంది. దీనిని మాన స్తంభ అంటారు. ఎడమవైపు ఏక శిల ఏనుగు కలదు.
గుహ నెం.33 (జగన్నాధ సభ) ఈ గుహను జగన్నాధ సభ అని అంటారు. ఈ గుహ ముందు గుహ కంటే విస్తరణగా ఉంటుంది. అదే రకమైన చిత్రాలు శిల్పాలు దీనిలో ఉంటాయి.



Click it and Unblock the Notifications