Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫతేహాబాద్ » ఆకర్షణలు » బనావలి

బనావలి, ఫతేహాబాద్

1

వనావలి అని కూడా పిలిచే బనావలి, ఫతేహాబాద్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురావస్తు మట్టి దిబ్బ. ఈ దిబ్బ 10 మీటర్ల ఎత్తుతో, సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక్కడికి దగ్గరలో ప్రజా జీవనం లేనప్పటికీ చారిత్రికంగా, పురావస్తు పరంగా చదువులో ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థాన౦. బనావలిలో జరిపిన తవ్వకాలలో క్రీ.పూ. 2500 – 2300, 2300-1700 మధ్య కాలంలో పూర్వ-హరప్పా, హరప్పా కాలానికి చెందిన అమూల్యమైన చారిత్రిక సమాచారం వెల్లడి అయింది

పురావస్తు శాస్త్రవేత్తలు ఆ కాలానికి చెందిన పూర్తి- జనజీవనంతో కూడిన టౌన్షిప్ ఉండేదన్నవిషయానికి ఆధారాలను కనుగొన్నారు. అప్పటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అని కూడా వారు నిర్ధారించారు. బార్లీ, ఆవాలు, నువ్వులు వంటి పంటలను పండించారు. వారి ప్రధాన పనిముట్టు నాగలి. ఈ పరిశోధనలలో కనుగొన్న వస్తువులు అప్పటి ప్రజల సంపద స్థాయిపై ఒక అవగాహనను కల్గిస్తాయి. ప్రజలు మట్టి ఇటుకలతో కట్టిన ప్రణాళికతో కూడిన ఇళ్ళలో నివసించేవారు. వారికి సేదతీరడానికి గదులు, వంటగదులు, భద్రపరిచే గదులు, మట్టి కుండలు ఉన్న స్నానపు గదులు, వాష్ బేసిన్లు, మురుగునీటి వ్యవస్థ ఉండేది. చక్కటి రోడ్లు, దారులు ఉన్నాయి.

ఇక్కడ కనబడిన వస్తువులలో బంగారం, కంచు, రాగి, వెండితో చేసిన ఆభరణాలు, దేవి, దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. హస్త కళాకారులు రాగి, కంచు ఉపయోగించి వస్తువులను, ఆయుధాలను తయారు చేసారు. పక్షులు, పూలు, చెట్లను ప్రదర్శించే అనేక విగ్రహాలు, చిత్రాలను కూడా కనుగొన్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed