రాతి స్థూపాన్ని ఉర్దూలో లాట్ అంటారు. ఫతేహాబాద్ లోని రాతి స్థూపాన్ని నిజానికి హర్యానాలోని హన్సి లేదా అగ్రోహలో అశోక చక్రవర్తి నిర్మించాడు. ఇది పేరుకు తగినట్లుగానే అశోక చక్రవర్తి కీర్తి స్తంభం. అయితే, తమ పేరును చాటి చెప్పుకోవడానికి హిందూ కట్టడాలను, సామానును మసీదులను, ఇతర ముస్లిం కట్టడాలను నిర్మించడానికి ఉపయోగించిన భారతదేశంలోని ఇతర ముస్లిం పాలకులవలె ఈ భారీ స్థూపాన్ని ఫిరోజ్ షా తుఘ్లక్ విడదీసి అదే సంప్రదాయాన్ని అనుసరించాడు.
ఫిరోజ్ షా తుఘ్లక్ ఈ స్థూపంలోని కింది భాగాన్ని ఫతేహాబాద్ కు తరలించి, అక్కడ వేరొక స్థూపాన్ని నిర్మించాడు. అసలైన అశోకుని వ్రాతలను అతను తొలగించి, తన కుటుంబ చరిత్రను అరబ్బీ లిపిలో వ్రాయించాడు. పై భాగాన్ని హిస్సార్ తీసుకొని వెళ్లి, మసీదు నిర్మాణానికి వాడాడు.
ఫిరోజ్ షా తుఘ్లక్ కోట ఫతేహాబాద్ లోని మసీదు లేదా ఇద్గా పక్కన నిర్మించిన ఈ లాట్ 15.6 అడుగుల ఎత్తుతో, 6 అడుగుల ఆధారంతో ఉంటుంది.



Click it and Unblock the Notifications