86 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వున్న హారికే చిత్తడి నేల ఫిరోజ్పూర్ అమృతసర్ సరిహద్దులో వుంది. దీని అంతర్జాతీయ ఖ్యాతి వల్ల ఈ చిత్తడి నేలను 1999 లో వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటి౦చారు. ఈ భూభాగానికి 1990 లో అంతర్జాతీయ చిత్తడి నేలల సంస్థ UNDP పథకం క్రింద రామసార్ కేంద్రం హోదాను ఇచ్చింది.
శీతాకాలంలో సైబీరియా నుంచి, ఆర్కిటిక్ నుంచి వచ్చే వాటితో సహా ఎన్నో వలసపక్షులకు, ఇది ఆవాసంగా పనికి వస్తోంది. వీజియన్, షోవేలర్, కామన్ టీల్, పిన్ టెయిల్, బ్రాహ్మినీ బాటు లాంటివి ఇక్కడ చూడవచ్చు. క్రేస్టేడ్ పోచార్డ్, కామన్ పోచార్డ్, టఫ్టేడ్ బాటు లాంటి వాటికి ఇది ప్రసిద్ధ స్థానం. పర్యాటకులు ఇక్కడ ఏడు రకాల తాబేళ్లు, 26 రకాల చేపలు చూడవచ్చు. ఇండియన్ ఒట్టర్, ఇండియన్ వైల్డ్ బోర్, అడవి పిల్లి, తోడేలు, ముంగిస కూడా ఇక్కడ కనపడతాయి.



Click it and Unblock the Notifications