త్రికూటేశ్వర దేవాలయం, శైవ దేవాలయం. గడగ్ పట్టణంలో కలదు. ఇక్కడ విశేషంగా మూడు శివలింగాలు ఒకే రాతిపై ఉంటాయి. తూర్పు భాగంగా బ్రహ్మ, శివ మరియు విష్ణు మూర్తులను ప్రతిబింబిస్తాయి. త్రికూటేశ్వర దేవాలయం లో మరికొన్ని దేవాలయాలుండటంతో దీనిని సముదాయమన్నారు. లోపల సరస్వతి దేవాలయం, శారద, గాయత్రి దేవాలయాలు కూడా కలవు. సోమేశ్వర దేవాలయం కూడా లోపలే కలదు.
చాళుక్య పాలనలోని ఈ పురాతన దేవాలయం అందమైన చెక్కిన శిల్పాలకు, రాతి గోడలకు ప్రసిద్ధి. కళ్యాణి చాళుక్యుల ప్రసిద్ధ 50 దేవాలయాలలో ఇది ఒకటి. గడగ్ పట్టణం హుబ్లీ ధార్వాడ లైనులో సుమారు 50 కి.మీ.ల దూరం ఉంటుంది. గడగ్ రైలు స్టేషన్ కలదు. చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. సమీప పట్టణాలనుండి స్ధానిక రోడ్డు రవాణా బస్సులు కూడా కలవు.



Click it and Unblock the Notifications