గోవర్ధన పట్టణం మధ్యలో రాజా భగవాన్ దాస్ మరియు రాజా మాన్ సింగ్ లు మన్సి గంగా ట్యాంక్ అనే రాతి ట్యాంక్ ను నిర్మించెను. 'మన్సి' అనే పదమునకు మనసు అని అర్దము.
ఒక పురాణం ప్రకారం,కృష్ణ సంరక్షక తల్లిదండ్రులు అయిన నంద మరియు యశోదలు గంగా పవిత్ర స్నానం చేయాలనీ కోరుకున్నారు. కానీ గంగ చాలా దూరంగా ఉండుట వల్ల బ్రిజ్ నివాసితులను మరియు బృందావనంను వదిలి అక్కడకు వెళ్ళడం నంద,యశోదలకు ఇష్టం లేదు.
కృష్ణుడు వారి కోరిక గురించి విని తన మనస్సు యొక్క శక్తితో గోవర్ధన గిరికి గంగాను తీసుకువచ్చెను. అందుకే ఈ ట్యాంక్ కు మన్సి గంగా అని పేరు వచ్చెను. యశోద మరియు బ్రిజ్ నివాసితులు నదిలో స్నానం ఆచరించినప్పుడు వారికీ గంగా మాత మొసలి మీద స్వారీ చేయటం కనిపించెను.
ఈ పవిత్రమైన మన్సి గంగా లో స్నానం చేస్తే శ్రీ కృష్ణుడి ప్రేమ రూపంలో మిలియన్ రెట్లు ఎక్కువ ఆధ్యాత్మిక యోగ్యతా వస్తుందని నమ్మకం. గోవర్ధన చుట్టూ ప్రదక్షిణతో ప్రారభమై మన్సి గంగాలో ఒక స్నానంతో ముగుస్తుంది.
Powered by



Click it and Unblock the Notifications