నికోబార్ దీవుల సముదాయంలోగ్రేట్ నికోబార్ పెద్ద దీవి. మిగిలిన దీవులకు ఈ ద్వీపం దక్షిణంగా ఉండి ఇందిరా పాయింట్ కలిగి ఉంటుంది. ఇండియాకు దక్షిణంగా చివరి ప్రదేశం అయిన గ్రేట్ నికోబార్ వివిధ మొక్కలకు, జంతువులకు, నీటి జీవాలకు అనేక రకాల పక్షులకు, పూవులకు నిలయంగా ఉంది.
పర్యాటకులను హనీమూన్ జంటలను ఈ బీచ్ ఎంతో ఆకర్షిస్తోంది. గ్రేట్ నికోబార్ చేరటం తేలికగానే ఉంటుంది. పోర్ట్ బ్లెయిన్ నుండి పవన్ హేన్స్ హెలికాప్టర్ సర్వీసులు కలవు లేదా బోట్లు, ఫెర్రీ సేవలు కలవు. పోర్ట్ బ్లెయిర్ నుండి బోటు లో ప్రయాణిస్తే మీరు మార్గంలో అనేక ఇతర ఆకర్షణలైన లిటిల్ నికోబార్, నాన్ కౌరీ మరియు కార్ నికోబార్, ఉత్తర నికోబార్ గ్రూపు దీవులను చూడవచ్చు.
గ్రేట్ నికోబార్ లో ఇందిరా పాయింట్ తర్వాత పర్యాటకులు అధికంగా చూసే ప్రదేశం కేంప్ బెల్ బే నేషనల్ పార్క్. అండమాన్ మరియు నికోబార్ దీవులలో కనపడే పక్షిజాతులలో చాలా భాగం ఈ దీవిలో కనపడతాయి. బర్డ్ వాచర్స్ కు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. ఇక్కడ కల నేషనల్ పార్క్ ఫొటోగ్రాఫర్ల స్వప్న సౌనధం. ఈ దీవిని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్ధ కూడా గుర్తించింది.



Click it and Unblock the Notifications