ద్రుంగ్ ప్రదేశం గుల్మార్గ్ కు కొద్ది దూరంలో వుంటుంది. ఈ ప్రదేశాన్ని ఇటీవలే కనిపెట్టారు. ఒక రోజు పిక్నిక్ లకు బాగుంటుంది. ఇక్కడ చేపలు పట్టటం, రాక్ క్లైమ్బింగ్ కూడా ఆనందించవచ్చు. ఆర్కేయోలజిలో ఆసక్తి కలవారు అక్కడ కల పురాతన టెంపుల్ శిధిలాలను చూడవచ్చు. కొద్దిపాటి కాలి నడకలో అక్కడ కొండలపై కల పాండవ దేవాలయ శిధిలాలను కూడా చూడవచ్చు.
అధిక రోజులు గడపాలనుకునే పర్యాటకులు ఇక్కడకు 3 కి. మీ. ల దూరంలో కల టాంగ్ మార్గ ప్రదేశం లో హోటల్ గదులు బుక్ చేసుకోవచ్చు. టాంగ్ మార్గ నుండి ఫెరోజ్ పూర్ ప్రవాహం చేరవచ్చు.



Click it and Unblock the Notifications