ఖిలన్ మార్గ గుల్మార్గ్ బస్సు స్టాప్ కు 4 కి. మీ.ల దూరం లో కలదు. ఈ దూరాన్ని పర్యాటకులు నడకలో ఎన్నో సుందర దృశ్యాలు చూస్తూ చేరిపోవచ్చు. ఈ నడక లో టూరిస్టులు ననగా పర్బాత్ , హిమాలయాలు నున్ మరియు కున్ శిఖరాలు వంటివి చూసి ఆనందించవచ్చు. ఖిలన్ మార్గ సమీపం లో అనేక సుందరమైన పర్యాటక ఆకర్షణలు కలవు.
ఖిలన్ మార్గ పొలిమేరలలో 'వ్యూ పాయింట్' కలదు. ఇక్కడ నుండి హిమాలయాలు అద్భుతంగా కనపడతాయి. ఫిరోజ్ పూర్ నాలా, రివర్ బహాన్, అల్ పత్తర్ లేక్, బాబా రిషి మసీదు వంటివి చేరటానికి ఖిలన్ మార్గ బేస్ క్యాంపుగా పని చేస్తుంది. ఇక్కడ క్యాంపు చేసి టూరిస్టులు ఫిషింగ్ వంటివి చేసి ఆనందిస్తారు.