ఇది హేమకూట కొండ దిగువన ఉంది. దీనిలోని 8 అడుగుల గణేశ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఆవ గింజల ఆకారంలో ఉంటుంది. ఒక కధనం మేరకు గణేషుడి పొట్ట పెరిగిపోతున్న కారణంగా, ఒక పాముతో దానిని బంధించి పెరగకుండా చేసుకున్నాడని చెపుతారు.
ఈ విగ్రహం ఒకే రాతితో చేయబడింది. గణేషుడి కుడి చేయిలో విరిగిన దంతం మరియు అంకుశం ఉంటాయి. పై భాగ ఎడమ చేయిలో ముడివేయబడిన తాడు ఉంటుంది.శశివేకాలు గణేష ముందు భాగంలోని ఒక పెద్ద హాలు షుమారుగా 1506లో చంద్రగిరినుండి వచ్చిన ఒక వ్యాపారి నిర్మించినట్లు చెపుతారు. దీనిని అతడు విజయనగర వంశస్ధుడైన రాజు నరసింహ II గౌనవార్ధం నిర్మించినట్లు చెపుతారు.



Click it and Unblock the Notifications