Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హర్యానా

హర్యానా  – మహాభారతం జరిగిన ప్రాంతం !!

భారత దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. తూర్పున ఉత్తర ప్రదేశ్, పశ్చిమాన పంజాబ్, దక్షిణం లో రాజస్థాన్, తూర్పున హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుగా కలిగి వుంది ఈ రాష్త్రం. భారత రాజధాని డిల్లీకి ఆనుకుని వున్న ఈ రాష్ట్రం, డిల్లీకి పశ్చిమ, ఉత్తర, దక్షిణ సరిహద్దుగా కూడా వుంది. అయితే 1966 లో పంజాబ్ నుంచి చీల్చాక ఈ రాష్ట్రం ఏర్పడింది.

హర్యానా లోని పర్యాటక ప్రాంతాలు డిల్లీ నుంచి కేవలం నిమిషాల్లో చేరుకోగలిగే హర్యానా చాలా అందమైన, విశిష్ట పర్యాటక ప్రాంతాలను అందించే రాష్త్రం. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఈ రాష్ట్రంలోనే వుంది.  ఫరీదాబాద్ లోని బద్ఖల్ సరస్సు కూడా ఇక్కడ చూడదగిన మరో ఆకర్షణ.

భివాని వద్ద వున్న నక్షత్ర నిర్మాణం కూడా ప్రపంచం మొత్తం నుంచి పర్యాటకులను ఆకర్షించిన ప్రదేశం. గుళ్ళు అనండి, కోటలు లేక సరస్సులు, పార్కులు ఏవైనా అనండి, అన్ని హర్యానా పర్యాటకం లో వున్నాయి.హర్యానా ప్రజలు, సంస్కృతి

గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రం హర్యానా. వేద కాలం నాటి చరిత్ర కలిగిన ఈ రాష్ట్రం గురించి హిందూ పురాణాల్లోను ప్రస్తావన వుంది. విశ్వ విధాత బ్రహ్మ ఇక్కడే తపస్సు చేసి సృష్టి మొదలు పెట్టాడు.హర్యానా గొప్ప వారసత్వానికి సొబగులు అద్దే విషయాలు ఇంకా చాలా వున్నాయి. మహాభారతాన్ని రాయడానికి వేద వ్యాసుడు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నాడు. ఇక్కడి ప్రజలు ఇప్పటికీ తమ సంప్రదాయాలను కొనసాగిస్తుంటారు, యోగ, ధ్యానం, మంత్ర పునశ్చరణ లాంటివి ఇప్పటికీ చేస్తుంటారు.

ఉత్తర భారతానికి ముఖద్వారం ళా వుండే హర్యానా ప్రాచీన కాలం నుంచి చాలా యుద్ధాలు చూసింది. తమ హక్కులు, విలువల కోసం పోరాడే ఇక్కడి ప్రజలు చాలా నిర్భయులుగా వుంటారు.

హర్యానా లోని పండుగలు, పబ్బాలు హర్యానా మునుపటి పంజాబ్ లోని భాగం కావడంతో ఈ రెండు రాష్ట్రాల సంస్కృతులు దగ్గరిగా వుంటాయి. హర్యాన్వీ, హిందీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఇక్కడ ఎక్కువగా వాడే భాషలు. ప్రధాన పండుగలన్నీ ఈ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు.

హర్యానా లో జరుపుకునే ప్రసిద్ధ పండుగలలో ఒకటి లోహ్రీ. శీతాకాలం తరువాత, మకర సంక్రాంతికి ముందు వచ్చే ప్రజనన కాలాన్ని స్వాగతించడానికి ఈ పండుగ జరుపుకుంటారు. సంప్రదాయంగా పంజాబ్ లో ఈ పండుగ పుట్టినప్పటికీ హర్యానా మొత్తం లో కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు.

గంగోర్, బైసాఖీ, గుగ్గ్ నవమి, సూరజ్ కుండ్ హస్తకళా ఉత్సవం, కార్తిక ఉత్సవం హర్యానాలో జరుపుకునే ఇతర పండుగలు. హర్యానా పర్యాటక శాఖ ఏర్పడిన సెప్టెంబర్ 1 వ తేదీని హర్యానా దినోత్సవం గా జరుపుకుంటారు.

హర్యానా – రొట్టెల భూమి ఇక్కడి సంస్కృతి లాగే ఇక్కడి వంటకాలు కూడా చాలా సరళంగా వుంటాయి. ఇక్కడి ప్రజలు, వేడిగా, రుచిగా వుండే పౌష్టికాహారం రొట్టెలను తినకుండా ఉండలేరు. ఈ రాష్ట్రం విస్తారంగా పాల ఉత్పత్తి చేస్తుంది కనుక, ఇక్కడి మిఠాయిల్లో పాలు, పాల పదార్ధాలు వాడతారు. మెట్రో నగరాల్లో జంక్ ఆహారం తింటారు గానీ, హర్యాన్వీలు తేలిగ్గా వుండే పౌష్టికాహారం ఇష్టపడతారు. లస్సీ, కచ్రీ కీ సబ్జీ, దాల్ మిశ్రమం, మేతి ఘజ్జర్ లాంటివి ఇక్కడి ప్రసిద్ధ వంటకాలు.

రవాణా సౌకర్యాలు :వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా హర్యానా అన్ని ప్రధాన నగరాలకు కలపబడి వుంది. రాజధాని డిల్లీ కి దగ్గరగా వుండడం వల్ల హర్యానా చేరుకోవడం చాలా తేలిక.

హర్యానా వాతావరణం హర్యానా లో ఏడాదిలో ఎక్కువ భాగం ఖండాంతర వాతావరణం వుంటుంది. ఇక్కడి వేసవులు చాలా వేడిగా వుండి, శీతాకాలాలు చాలా చల్లగా వుంటాయి. కర్నాల్, అంబాలా జిల్లాల్లో తప్ప హర్యానా లో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడవు. మహేంద్ర ఘర్, హిస్సార్ జిల్లాల్లో కనిష్ట వర్షపాతం నమోదౌతుంది.

హర్యానా ప్రదేశములు

  • కురుక్షేత్ర 50
  • అంబాలా 10
  • పంచకుల 57
  • యమునా నగర్ 6
  • జగాద్రి 7
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed