హాసన్ జిల్లా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగాచి డ్యాం బేలూర్ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. 2004లో నిర్మించబడ్డ ఈ డ్యాం ప్రధాన లక్ష్యం బేలూర్, హసన్, చిక్మగలూర్ జిల్లాల్లోని త్రాగునీరు, సాగు నీటి అవసరాలను తీర్చడం. యగాచి నది మీద (కావేరీ నదికి ఉపనది) సముద్రమట్టానికి 965 అడుగుల ఎత్తులో భారీ జలాశయం నిర్మి౦చారు.
యగాచి డ్యాం నించి 4300 క్యూసెక్కుల నీరు బైటికి వెళుతుంది, 4500 క్యూసెక్కుల నీరు లోపలికి చేరుతుంది. నక్సలైట్ల ప్రమాదం వల్ల ఈ ఆనకట్టను పోలీస్ వారు స౦రక్షిస్తున్నారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు ఇటీవలే ఇక్కడి జలాశయంలో జల సాహస క్రీడల కేంద్రం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ప్రయాణీకులు బనానా బోట్ రైడ్, క్రూఇస్ బోట్, స్పీడ్ బోట్, కాయాకింగ్, జెట్ స్కింగ్, బంపర్ రైడ్స్ లాంటి జల క్రీడల్లో పాల్గొనవచ్చు. వీటితో పాటు, ప్రశాంత పరిసరాల నడుమ సమయ౦ గడపాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం.



Click it and Unblock the Notifications