హేమిస్ నేషనల్ పార్క్ లేదా హేమిస్ హై ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఇండస్ నదీ తీరంలో సముద్ర మట్టం నుండి 3300 నుండి 6000 మీటర్ల ఎత్తులో ఉంది. బుద్ధిష్ట్ మొనాస్టరీ అయిన హేమిస్ మొనాస్టరీ పేరునే దీనికి పెట్టారు.
1991 లో నేషనల్ పార్క్ గా ప్రకటించబడిన ఈ ప్రాంతం 600 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. 1988, సుమారుగా 3350 చదరపు కిలోమీటర్ల మేరకు ఏరియాని పెంచారు. తిరిగి 1990 లో 4400 చదరపు కిలోమీటర్ల వరకు పెంచారు. అన్ని అదనపు చేర్పుల తరువాత ఈ ప్రాంతాన్ని దక్షిణ ఆసియాలోనే అతి పెద్దదైన నేషనల్ పార్క్ గా గుర్తించారు. అంతే కాకుండా, నందా దేవి బయోస్ఫియర్ తరువాత పెద్దదైన సంరక్షిత ప్రాంతంగా ఈ హేమిస్ నేషనల్ పార్క్ ని ప్రకటించారు.
అరుదైన జంతుజాలం మరియు వృక్ష జాలాలకి స్థావరం ఈ నేషనల్ పార్క్. మర్మట్స్, లంగుర్స్, రెడ్ ఫాక్స్, డీర్, వొల్వ్స్, స్నో లెపర్డ్, అంతరించబడుతున్న అరుదైన జాతులు, మకాక్స్ మైర్యు ఉరయాల్స్ వంటి వాటికి ఈ పార్క్ నివాసం.
ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువ. అందువల్ల సబ్ఆల్పైన్ బిర్చ్-ఫిర్, జునిపెర్, మరియు పోపులాస్-సలిక్ష్ వంటి వృక్ష సంపదలను ఇక్కడ గమనించవచ్చు. నివేదికల ప్రకారం, ఈ హేమిస్ నేషనల్ పార్క్ లో దాదాపు 70 రకాల పక్షులు, 16 రకాల క్షీరదాలు ఉన్నాయి. లమెర్జిర్ రాబందు, గోల్డెన్ ఈగల్, అలాగే హిమాలయన్ గిఫ్ఫోన్ రాబందు వంటివి ఇక్కడున్న కొన్ని రకాల పక్షులు. ఈ హేమిస్ నేషనల్ పార్క్ ని ఏడాది పొడవునా ఏ సమయంలోనైన పర్యాటకులు సందర్శించవచ్చు. అయితే, మే నుండి అక్టోబర్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయంగా పేర్కొనవచ్చు.



Click it and Unblock the Notifications