ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాలలో ఖ్వైరంబండ్ బజార్ లో ఉన్న IMA కెఇథెల్ మహిళల మార్కెట్ ఒకటిగా ఉంది. మీరు IMA కెఇథెల్ వద్ద ఏ వస్తువునైన పొందవచ్చు. దీనిని మహిళలలే పూర్తిగా నడుపుతున్నారు. ఒక కార్నర్ లో ఒక మహిళ చేపలు అమ్మటం లో బిజీగా ఉంటే, మరొక కార్నర్ లో మహిళ అల్లడం మరియు సంతోషంగా వినియోగదారులకు తాజాగా తయారుచేసిన ఊలు బట్టలు అమ్మడం చూడవచ్చు.
100 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం IMA కెఇథెల్ లో మహిళలకు సమానత్వం మరియు స్వతంత్ర్యానికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన చిహ్నంగా ఉంది. ఇక్కడ 3000 కంటే ఎక్కువ మంది మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు IMA కెఇథెల్ లో కూరగాయలు, చేనేత వస్త్రాలు ,హస్తకళలు మరియు చేప వంటి ఏదైనా కొనుక్కోవచ్చు.
IMA కెఇథెల్ అనేది ఒక మణిపురి పదం. దీనికి అర్దము IMA అంటే తల్లి అని, కెఇథెల్ అంటే మార్కెట్ అని అర్దము. కమ్యూనిటీలు మరియు మతాలకు సంబంధం లేకుండా ప్రతి మహిళ ఇక్కడ స్టోర్స్ ఏర్పాటుచేసుకోవచ్చు.