ఇటార్సిలో బూది మాత మందిర్ ప్రసిద్ధి చెందినది. ఇటార్సి లో కల అనేక మతపర ప్రదేశాలలో ఇది ప్రధానమైనది. ఈమందిరానికి భక్తులు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు. ఇటార్సి లో పరిశ్రమలు ఎట్లు అధికమో, మతపర ప్రదేశాలు కూడా అట్లే అధికం. ఈ నగర ప్రజల మతపర విశ్వాసాలకు ప్రతీకగా బూది మాతమందిర్ నిలుస్తుంది.
అందమైన పరిసరాలు, పచ్చటి వృక్షాలు కల ప్రదేశంలో వున్న మందిర్ పరిసరాలను ప్రతి ఒక్కరూ ఆనందిస్తారు. టెంపుల్ యొక్క తెల్లటి గోడలు, సూర్యకాంతిలో ధగ ధగ మంటూ పవిత్రతను, శాంతిని సూచిస్తాయి. టెంపుల్ లోని దేవత పట్ల భక్తులకు పూర్తి నమ్మకం మరియు భక్తి కలవు. ఈ టెంపుల్ కు ఇటార్సి రైల్వే స్టేషన్ నుండి తేలికగా చేరవచ్చు.



Click it and Unblock the Notifications