కల్లిల్ దేవి దేవాలయం కలాడీ నుండి 22 కి.మీ.దూరం కలదు. ఇది ఒక జైన మందిరం సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారు. కల్లిల్ అంటే మళయాళంలో రాయి అని అర్ధం. ఈ దేవాలయం 28 ఎకరాల ప్లాట్ లో ఒక పెద్ద రాతిని చెక్కబడి నిర్మించబడింది. ఈ దేవాలయం దర్శించాలంటే, రాతి మార్గంలో చెక్కబడిని సుమారు 120 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.
ఈ మందిరం కల్లిల్ పిషారోడీ కుటుంబం నిర్మించింది. పిషారోడీ బ్రాహ్మణకులానికి చెందినవాడు. జైనమతంలో విశ్వాసం కలవాడు,. ఈ మందిరంలో ప్రధా దైవం దుర్గా దేవి. ఇంకనూ పార్శ్వనాధుడు, మహావీరుడు మరియు భగవతి దేవిగా పిలువబడే పద్మావతి దేవి విగ్రహాలు కూడా కలవు. బ్రహ్మ దేవుడి రూపాన్ని ఒక రాతిలో మలచారు. ఈ దేవాలయంలో రాత్రి వేళ పూజ చేయరు. పగటిపూట, అంటే మిట్ట మధ్యాహ్నం 12 గం.లకు ముందర మాత్రమే పూజలు నిర్వహిస్తారు. పూజ అయిన వెంటనే దేవాలయం మూసివేస్తారు. నవంబర్, డిసెంబర్ నెలలో ప్రతి ఏటా ఉత్సవాలు చేస్తారు. ఆడ ఏనుగులపై ప్రధాన దేవతను ఊరేగిస్తారు.



Click it and Unblock the Notifications