జన్స్కార్ ఒక తాలూక. ఇది కార్గిల్ జిల్లా లో ఉత్తరంగా కలదు. సంవత్సరం లో సుమారు ఎనిమిది నెలల పాటు మంచుతో కప్పబడి, ఇతర ప్రపంచం నుండి వేరుగా వుంటుంది.ఇక్కడి ఎత్తైన ప్రదేశం లో రెండు ప్రసిద్ధి సరస్సులు కలవు. ఎన్నో బౌద్ధ ఆరామాలు కలవు. ఈ బౌద్ధ అరామాల శిల్ప శైలి, సరస్సుల అందం పర్యాటకులను ఆకర్షిస్తాయి.
జన్స్కార్ వెళ్ళే మార్గంలో దరాంగ్ ద్రుంగ్ మంచు కొండ చూడవచ్చు. వాలీ మధ్య భాగం లో కల ఈ కొండ ప్రదేశం నుండి, హిమాలయాలు, కార్గిల్ చూడవచ్చు. ఈ ప్రదేశంలో కర్షా, ఫుగ్తాల్, స్తారిమో ఆరామాలు కూడా చూడదగినవి.



Click it and Unblock the Notifications