దౌలా వాలి మాత టెంపుల్ కథువా జిల్లాలో సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున కలదు. జోడియా డి మాతా టెంపుల్ కు 10 కి. మీ.ల దూరంలో వుంటుంది. ట్రెక్కింగ్ లో చేరాలి. భూండ్ నుండి, కాటిల్, బంహోరే మార్గంలో వెళ్ళాలి. ఒక గొర్రెల కాపరి కి మాత ఒక చిన్న పిల్ల రూపంలో కలలో కనపడి గుడి కట్టమని చెప్పిందని దానితో అతను అక్కడ గుడి కట్టగా, మాత వచ్చి అక్కడ దర్శినమిచ్చిందని అప్పటి నుండి ఆ దేవాలయం ప్రసిద్ధి చెందినదని చెపుతారు.
ఈ గుడిలో నవరాత్రులు సంవత్సరానికి రెండు సార్లు జరుగుతాయి. జమ్మూ, పఠాన్ కోటే, ఉధంపూర్, కథువా ల నుండి మహాన్పూర్, భూండ్, బిల్లవార్, బసోహిల్ లకు బస్సులు తేలికగా దొరుకుతాయి. .



Click it and Unblock the Notifications