కకోచంగ్ జలపాతం, అస్సాంలోని గోలాఘాట్ జిల్లలో బోకఖాట్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాకృతిక స్వర్గంలో, దూరంగా ఉన్న ఒక అందమైన జలపాతం. ఈ జలపాతం పరవళ్ళు తొక్కుతూ ఈ జిల్లాలోని కాఫీ, రబ్బర్ తోటల మధ్యగా కిందికి ప్రవహిస్తూ అందమైన ఉత్కంఠభరిత దృశ్యాన్ని అందిస్తుంది. కకోచంగ్ జలపాతం స్థానికులు, పర్యాటకులు ఒకే విధంగా తరచుగా సందర్శించే ఒక ప్రసిద్ధ విహారయాత్ర కేంద్రం. ఈ జలాశయం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతం విహారయాత్రీకులకు ఉత్తమమైనది.
నుమాలిఘర్ పురాతన శిధిలాలను కకోచంగ్ జలపాతం నుండి మనం చూడవచ్చు. ఈ పురాతన శిధిలాలకు గొప్ప పురావస్తు విలువ ఉంది. కాజీరంగా పార్కును సందర్శిస్తున్న పర్యాటకులు నుమాలిఘర్ లోని దియోపర్వతం శిధిలాలను సందర్శించినప్పుడు కకోచంగ్ జలపాతానికి ఒక రోజు ప్రణాళిక ద్వారా సులువుగా సందర్శించవచ్చు. జాతీయ పార్కు నుండి బోకఖాట్ 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారీ వర్షాల వలన నీరు సమృద్ధిగా జలపాతంలో చేరే వర్షాకాలం తర్వాతి నెలలు ఈ జలపాతం సందర్శనకు ఉత్తమమైనవి



Click it and Unblock the Notifications