కాజీరంగా జాతీయ పార్కులో పర్యాటకులు ఉన్నప్పుడు సందర్శించదగిన ఆసక్తికరమైన అనేక ఆకర్షణలు నారాయణపూర్ లో ఉన్నాయి. వాటిలో ఒకటి సాకుచి గ్రామంలో ఉన్న రాధా పుఖురి. ఈ చెరువును ప్రస్తుతం అస్సాం ప్రభుత్వ మత్స్య శాఖ వారు చేపల సంతానోత్పత్తి, సాగు కోసం ఉపయోగిస్తున్నారు.
ఖచ్చితమైన సంవత్సరం తెలపలేక పోయినప్పటికీ రాధా పుఖురి క్రీ.శ. 1400, 1500 మధ్యలో నిర్మించినట్లుగా విశ్వసిస్తారు. రాధా పుఖురి నిర్మించిన లఖ్మినారాయణ రాజు ఈ చెరువుకు తన భార్య ‘రాధా’ పేరును పెట్టారు. అయితే, సర్బెశ్వరి మహారాణి ఈ చెరువును నిర్మించిందనే వ్యతిరేక అభిప్రాయాన్ని ఇతర చరిత్రకారులు కల్గి ఉన్నారు.
రాధాపుఖురిని సంగ్రహంగా అధాపుఖురి అంటారు, ‘ఆధా’ అంటే సగం, ఎందుకంటే నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. తర్వాత దీనిని తిరిగి రాధా పుఖురిగా మార్చారు. జాతీయ పార్కు నుండి నారాయణపూర్ 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాధాపుఖురి సందర్శనకు ఆసక్తిగా ఉన్న పర్యాటకులు ఒక గంట సమయంలో సులువుగా నారాయణపూర్ ను చేరవచ్చును.



Click it and Unblock the Notifications