టీ తోటలు అస్సాం కు గర్వకారణం. అస్సాం టీ దాని రుచికి, రంగుకి ప్రసిద్ధి. కాజీరంగా జాతీయ పార్కు సందర్శన సమయంలో పర్యాటకులు దగ్గరలో ఉన్న కొన్ని టీ తోటలను సందర్శించడం పై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి.
కొండల పై నుండి దొర్లినట్లుగా కనబడే చిన్న చిన్న పచ్చటి తాజా పొదల దృశ్యం ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చూడదగినది. చాలావరకు టీ తోటలు పర్యాటకులను హార్దికంగా స్వాగతం పలుకుతూ ప్రజలు చూడటానికి తెరిచి ఉంచబడతాయి. ఈ జాతీయ పార్కు దగ్గరలోని మోతోని, హత్ఖులి, డైఫలు, బోర్చపోరి, బెహార టీ తోటలు ఎంతో ప్రసిద్ధి పొందినవి.
అయితే ఈ టీ తోటలకు ఒక రోజు-పర్యటనకు వెళ్ళడం సాధ్యం కాగా, కొన్ని టీ తోటలలో రాత్రి బస చేసే సౌకర్యం కూడా ఉంది. కొన్ని రోజుల పాటు జాతీయ పార్కును సందర్శించే పర్యాటకులకు టీ తోటలలో ఒక రాత్రి బస చేయడం ఒక మంచి ఆలోచన. టీ తోటలు చాల వరకు పార్కుకు దగ్గరగా ఉన్నందున అక్కడకి ప్రయాణించడం ఏమంత కష్టం కాజీరంగా లోని అకదోహియ పుఖురి
ఈ పెద్ద చెరువు (అస్సాం భాషలో పుఖురి అంటే చెరువు అని అర్ధం) ధోల్పూర్ దగ్గరలోని కచువ గ్రామంలో ఉంది. ఈ చెరువుకు దగ్గరగా నివసించిన ఆకదోహి అనే పవిత్ర బ్రాహ్మణ గురువు పేరును ఈ చెరువుకు పెట్టారని విశ్వసిస్తారు. ఈ గురువు గారికి ఉన్న దివ్య శక్తుల వలన ఆయన ఆ గ్రామంలోనే కాక చుట్టూ పక్కల గ్రామాలలో కూడా ఎంతో ప్రసిద్ది చెందారని విశ్వసిస్తారు. ఈ రోజుకు కూడా ఈ చెరువు వద్ద పూజలు చేస్తే తమ కోరికలు నిజమౌతాయని స్థానికుల విశ్వాసం. అందువలన కచువ గ్రామ ప్రజలకు, దగ్గరలోని ఇతర గ్రామాల ప్రజలకు ఈ చెరువు పవిత్రమైనది.
ఈ ప్రాంతాన్ని ప్రజలు సందర్శించడం వలన, ఇది ఆకదోహియ పుఖురిని ఎంతో ప్రసిద్ధ ప్రాంతంగా మార్చింది. కొంతమంది తమ మనసులో ప్రార్ధనలతో ఇక్కడకు రాగా, మరి కొంతమంది ఈ చెరువును చూసి చుట్టూ నివసించే ప్రజల సంస్కృతిని తెల్సుకోవడానికి ఇక్కడకు వస్తారు. ఈ గ్రామం పరిసరాలు అస్సాంలోని గ్రామ ప్రజల జీవితానికి చెందిన ఒక సమగ్ర దృశ్యాన్ని అందిస్తాయి.



Click it and Unblock the Notifications