పవిత్రమైన తారిణీ మాత దేవాలయం వుండడం వల్ల ఘటగావ్ కియోంఝర్ జిల్లాలో వున్న పవిత్ర ప్రదేశం. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి కార్లో కేవలం గంట ప్రయాణం ద్వారానే ఘటగావ్ చేరుకోవచ్చు. శక్తి అవతారాల్లో ఒకరిగా తారిణీ మాతను భావిస్తారు. ఒరియా సంస్కృతిలో అందరు దేవీ దేవతలా కన్నా ఈవిడనే అతి శక్తివంతురాలిగా భావిస్తారు.
ఘటగావ్ దేవాలయం పుట్టుక గురించి ఒక కథ వుంది. ఎర్రటి ముఖం కల ఈ దేవతకు రెండు పెద్ద కళ్ళు వుంటాయి. తంత్రానికి సంబంధించిన ప్రధాన కేంద్రంగా భావించబడే ఈ ప్రదేశంలో తంత్రం చాలా ఏళ్ళ బట్టి సాధన చేస్తున్నారు. వేలాది మంది భక్తులు ఈ దేవతను ఏడాది పొడవునా సందర్శిస్తూనే వుంటారు.



Click it and Unblock the Notifications