1648 లో మహారాజా రూప్ సింగ్ రూపంగర్ ఫోర్ట్ ని నిర్మించారు. ఇప్పుడు, ఈ ఫోర్ట్ హెరిటేజ్ హోటల్ గా పునరుద్దరించబడింది. చారిత్రక అంశాల మీద ఆసక్తి ఉన్న వారికి ఈ హోటల్ నప్పుతుంది. రాజపుత్రుల ఉద్యమాలకు వ్యూహాత్మక ప్రదేశంగా ఈ ఫోర్ట్ ఉపయోగ పడేది. రాజస్థాని నిర్మాణ శైలికి ఈ కోట ఒక నమూనా లా ఉండేది. ఈ కోట నిర్మాణానికి ఉపయోగించిన అందమైన రాజస్తాన్ రాళ్ళు, పాల రాయి సందర్శకుల ని ఆకర్షిస్తాయి. హెరిటేజ్ హోటల్ లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నోరూరించే రుచికరమైన వంటకాలు, కనువిందు చేసే కళా ప్రదర్శనలు పర్యాటకులకి ఆహ్లాదం కలిగిస్తాయి. ఉదయం మరియు సాయంత్రం నడకకి సౌకర్యాలు కలవు. ఇవే కాకుండా ఇంటర్నెట్ మరియు లైబ్రరీ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications