కొచ్చి లో ఉన్న ప్రముఖ బీచ్ ల లో చేరాయి బీచ్ ఒకటి. ఇది కొచ్చికీ 25 కి మీ ల దూరం లో ఉంది. వైపిన్ ద్వీపం లో ఈ బీచ్ ఉంది . మనోహరమైన సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి ఆనందించేందుకు ఈ బీచ్ కి ఏంతో మంది పర్యాటకులు మరియు స్థానికులు తరలివస్తారు. రోడ్డు మరియు సముద్ర మార్గం ద్వారా ఈ బీచ్ కి చేరుకోవచ్చు.
అద్బుతమైన సీ ఫుడ్ ని అందించే ఎన్నో హోటల్స్ మరియు రెస్టారెంట్స్ ఇక్కడ ఉన్నాయి. తాజా సీ ఫుడ్ ని అమ్మే చిన్న చిన్న కోట్లు చాలా ఉన్నాయి. మీకు నచ్చిన చేపలు, రొయ్యలు లేదా పీతలు ఎంచుకుని మీకు నచ్చిన రెస్టారెంట్ లో వండడానికి ఆర్డర్ ఇచ్చి తిని ఆనందించే అవకాశం కూడా కలదు.
చాలా మందికి సముద్ర తీరంలో అలలతో ఆడుకోవడం ఇష్టంగా ఉంటుంది. కాని అలలు పెద్దవి అయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య బీచ్ లలో ప్రజలు హెచ్చరికలని పట్టించుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. బీచ్ లో మద్యపానం నిషేధం. ఒక వేళ స్థానిక పోలీసులకి పట్టుబడితే, జరిమానా మరియు జైలుశిక్ష నుండి తప్పించుకునే అవకాశం లేదు.



Click it and Unblock the Notifications