కొడంగలూర్ కి దక్షిణాన ఉన్న తిరువంచిక్కులం మహాదేవ ఆలయం దక్షిణ భారతదేశం లోనే అత్యంత పురాతన శివాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మహాశివుడు గోపురం దేవర్, దక్షిణామూర్తి, పశుపతి, నటక్కల్ శివన్, సంధ్యవేళ శివన్, పల్లియర శివన్, ఉన్ని దేవర్, కొన్నక్కల్ శివన్ రూపాల్లో దర్శనమిస్తాడు. 2000 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడి, శివుని వివిధ సాక్షాత్కారాలకి ప్రసిద్ధి.అనయోట్టం (ఏనుగుల పందెం) చూడటానికి జనం తండోపతండాలు గా వస్తారు. వార్షిక ఆలయ ఉత్సవం లో భాగంగా జరిగే ఈ పోటీ యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహా శివరాత్రి ఇక్కడ జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ.ఈ ఆలయ సముదాయంలోనే వివిధ దేవుళ్ళు, దేవతలకు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇక్కడి అద్భుతమైన కుడ్య చిత్రాలు (మ్యూరల్స్) వల్ల ఆలయానికి విశేషమైన ఖ్యాతి వచ్చింది. తిరువంచిక్కులం మహాదేవ ఆలయం భారతీయ పురావస్తు శాఖ చే సంరక్షించబడుతున్నది.



Click it and Unblock the Notifications