పిల్లలు ఇష్టపడే ఈ రంకాలా చౌపాటీ మీరు మీ కుటుంబంతో సాయంత్రాలను గడపడానికి గొప్ప ప్రదేశం. ఒక విహార కేంద్రంగా పని చేసే అందమైన ఉద్యానవనం ఇక్కడ వుంది. దగ్గరలోనే చూసి తీరాల్సిన శాలినీ పేలస్ వుంది.కొల్హాపూర్ లో వున్న చౌపాటి అనే సరస్సు పేరిట ఏర్పడ్డ ఈ చౌపాటి ఇక్కడి రంకభైరవ దేవాలయం పేరిట నామకరణం చేయబడింది. ఇక్కడి ఇతర కట్టడాల లాగే ఈ కృత్రిమ సరస్సు కూడా ఛత్రపతి శాహూ మహారాజ్ నిర్మించాడు. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు ఈ ప్రశాంత సరస్సులో పడవ నడపడం నుంచి గుర్రపు స్వారీ దాకా అన్ని పనులూ చేయవచ్చు.



Click it and Unblock the Notifications