ప్రకృతి అందాల్ని అతి సమీపం నుంచి సందర్శించే అవకాశాన్ని అష్టముడి సరస్సు పర్యాటకులకి ఇస్తుంది. రాష్ట్రం లోని అతిపెద్ద మంచినీటి సరస్సు అష్టముడి పరివాహకం లో ఏర్పడ్డ ఈ కయ్యి ఎంతో నిమ్మళంగా ఉంటుంది. ఈ సరస్సు లో విహారం, ఊగిసలాడే కొబ్బరి చెట్ల మధ్య, ఏపైన తాటి చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.
ఇక్కడి ప్రధాన ఆకర్షణ నీటిలో పడవ ప్రయాణం. బహుశా ఏ సందర్శకుడూ వదులుకోని అద్భుత అనుభవమిది. కొల్లాం జిల్లా పర్యాటక అభివృద్ది మండలి పగటి మరియు రాత్రి పూట విహరించే వివిధ రకాల పడవ ప్రయాణాలని ఆఫర్ చేస్తోంది. పర్యాటకులు తమ బడ్జెట్ ని బట్టి, అనుకూలతని బట్టి వీటిలో ఒకదాన్ని ఎన్నుకోవచ్చు.
వీరిచ్చే హౌస్ బోట్లు కూడా బెడ్ రూం, కిచెన్, బాల్కనీ వంటి అన్ని ఆధునిక వసతులూ కలిగి ఉంటాయి. ఇక్కడి రిసార్ట్లు, హోటళ్ళ లో స్పా, ఆయుర్వేదిక్ మసాజ్, సీ ఫుడ్ వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications