పాతానపురం కొల్లం జిల్లలోని ఒక పట్టణం. పడమటి కనుమల పర్వత శ్రేణిలో కలదు. ఈ పట్టణం పునలూర్ కు 13 కి.మీ.ల దూరంలో ఉండి తేలికగా రోడ్డు మార్గంలో చేరేదిగా ఉంటుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండి ఏనుగులు అధికంగా సంచరించేవి. ఈ పట్టణ పేరును పది ఏనుగుల భూమి అని అర్ధం వచ్చేలా చెపుతారు.
పాతానపురం మంచి వాణిజ్య కార్య కలాపాల కేంద్రం కనుక ఇక్కడ అనేక కాటేజ్ మరియు చిన్న పరిశ్రమలు, అంటే, ఇటుకల తయారీ, పాలు, మరియు పశువుల పరిశ్రమలు, వెదురు అల్లకం వంటివి అభివృధ్ధి చెందాయి. ఈ ప్రాంతంలో రబ్బర్ తోటలు కూడా కలవు.
కల్లాడ నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం సహజ అందాలను కలిగి ఉంది. పట్టణంలో అనేక చర్చిలు, దేవాలయాలు, మసీదులు కలవు. అన్నిరకాల మతాల సంస్ధలు ఉండటం చేత, పండుగలలో వేడుకలు అధికంగా జరుగుతాయి. పెరియార్ నేషనల్ పార్క్ పాతానపురం సరిహద్దులలో ఉంటుంది. పట్టణంలో ఇది ఒక ఆకర్షణ. మిగిలిన ఆకర్షణలలో వజ్జప్పార జలపాతాలు, పునలూర్ లోని సస్పెన్షన్ బ్రిడ్జి, కల్లాడ నది మరియు అంచుమాల పార మొదలైనవి కలవు.