కప్పాడ్ సముద్రపు తీరం, కొజ్హికోడ్

హోమ్ » ప్రదేశములు » కొజ్హికోడ్ » ఆకర్షణలు » కప్పాడ్ సముద్రపు తీరం

కప్పాడ్ (కప్పక్కడవు) సముద్రపు తీరం కోళికోడ్ కు ఉత్తరానా 16 కిమీ దూరములోకన్నూర్ రోడ్డు ను ఆనుకుని తిరువాంగూర్ లో ఉంది. ఇది ఒక రాళ్ళతో కూడిన సుందరమైన సముద్రపు తీరము. పర్యాటకులకు మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. 27 మే 1498 నాడు వాస్కో డా గామా మూడు ఓడలు, 170 మందితో ఇక్కడే దిగాడు. ఈ 'చారిత్రాత్మిక రాక' కు గుర్తుగా ఇక్కడ ఒక స్మారక చిహ్నం నిర్మించారు.

కొండ మీద ఉన్న ఒక పురాతనమైన ఆలయం ఈ ప్రాంతానికి మరొక ఆకర్షణ.ఈ ఆలయం 800 సంవత్సరాల పూర్వంది అని భావిస్తున్నారు. ఈ ఆలయం కప్పాడ్ బీచ్ లో ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.కప్పాడ్ కు పర్యాటకులు ఆయుర్వేదిక్ చికిత్సలు కోసం వస్తు ఉంటారు.ఇక్కడ బస చేయటానికి చాల మంచి రిసార్ట్స్ ఉన్నాయి.పర్యాటకులు రావటానికి వేసవి  మరియు వర్షాకాలం అనువుగా ఉంటుంది.

Please Wait while comments are loading...