Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» లుంగ్లీ

లుంగ్లీ పర్యాటకం - మిజోరాం రాక్ టౌన్ వంతెన !

11

మిజోరాం లో ని ఉన్న ఏడు జిల్లాలలో లుంగ్లీ ఒకటి. ఈ రాష్ట్రం లో ని ప్రసిద్ది పొందిన పర్యాటక ఆకర్షణలలో రెండవది. అదే పేరు మీద జిల్లా ప్రధాన కార్యాలయం కలిగి రెండవ పెద్ద నగరం ఇది. లుంగ్లీ ని లంగ్లీ అని కూడా అంటారు. అంటే, రాతి వంతెన అని అర్ధం. త్లవంగ్ అనే నది కి ఉపనది అయిన నఘసిహ్ వద్ద వంతెన లా ఒక రాయి కనపడింది. ఈ రాయి వలెనే ఈ ప్రాంతానికి లుంగ్లీ అనే పేరు వచ్చింది.

వృక్ష జాలం మరియు జంతు జలాలు సమృద్దిగా ఉన్న నగరం లుంగ్లీ. ప్రకృతి ప్రేమికుల స్వర్గం గా ఈ ప్రాంతాన్ని అభివర్ణించవచ్చు. ఈ పట్టణ పరిసరాలలో ఎన్నో విశాలమైన ప్రదేశాలు కలవు. లుంగ్లీ నుండి 50 కిలోమీటర్ల దూరం లో ఉన్న మువల్చెంగ్ గ్రామంలో బుద్ధుడి యొక్క చిత్రం మలచబడినది ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రాష్ట్రం లో ఉన్న ఏకైక బుద్ధుని ప్రాచీన స్మారక చిహ్నం ఇది. ఈ చిత్రం ఇక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ అంతుబట్టలేదు. లుంగ్లీ పర్యటనలో ఆసక్తి కరమైన అంశాలలో ఇది ఒకటి.

లుంగ్లీ లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు

ఖాంగ్లంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఖాంజావి పార్క్, సైకుతి హాల్ మరియు మిజోరాం-తాంలుయియా ముయల్ లో ఉన్న రెండవ టర్ఫ్ ఫుట్ బాల్ గ్రౌండ్ వంటివి లుంగ్లీ జిల్లాలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో కొన్ని. నదులు మరియు కొలనులతో పాటు లుంగ్లీ పర్యాటకం లో ఎన్నో పిక్నిక్ స్పాట్ లు కలవు.

లుంగ్లీ కి ఎలా చేరుకోవాలి

మిజోరాం రాజధాని ఐజావ్ల్ నుండి 175 కిలోమీటర్ల దూరం లో లుంగ్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంది. రాష్ట్ర రాజధానితో చక్కగా అనుసంధానమవటం తో పాటు మిజోరాం లో ని ఇతర ప్రాంతాలకు కూడా చక్కగా అనుసంధానం అయి ఉంది.

వాతావరణం

ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం లుంగ్లీ జిల్లా సొంతం. మూడు కాలాలలోని ఉష్ణోగ్రతలు ఆహ్లాదకరం గా ఉంటాయి. అరుదుగా ఉష్ణోగ్రత లు ఇబ్బంది పెట్టేటట్టుగా మారతాయి. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు.

లుంగ్లీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లుంగ్లీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లుంగ్లీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లుంగ్లీ

  • రోడ్డు ప్రయాణం
    జాతియ రహదారి 54, మిజోరాంలోని లుంగ్లీ తో పాటు ఇతర పట్టణాలకు చక్కగా అనుసంధానం అవుతుంది. రోడ్డు మార్గాలు ఇక్కడ ప్రధాన రవాణా మార్గాలు. రాష్ట్రం లో ని అన్ని ప్రాంతాల నుండి లుంగ్లీ చేరుకునేందుకు బస్సులు ఉన్నాయి. అలాగే, ప్రైవేటు వాహనాల సౌకర్యం కూడా ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    మిజోరాం రాష్ట్రానికి రైల్ హెడ్స్ లేవు అందుచేత సిల్చార్ ప్రాంతం లో ని రైల్వే స్టేషన్ని ఇక్కడికి సమీపం గా ఉన్న రైల్వే స్టేషన్ గా భావించవచ్చు. సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి లంబ్దింగ్ కు ఉన్న ఇరుకైన గేజ్ మార్గం వల్ల పర్యాటకులు గువహతి కి చేరుకునేందుకు మరి ఒక రైలు ని అందుకోవాలి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    లుంగ్లీ నుండి 193 కిలో మీటర్ల లో ఉన్న లెంగ్ పుయి విమానాశ్రయం లుంగ్లీ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ కి చేరుకునేందుకు కనీసం మూడు గంటల సమయం పడుతుంది. గువహతి, ఇంఫాల్, అగర్తల మరియు కోల్కతా ల కి ప్రత్యక్ష విమానాల సేవలు అందుబాటులో ఉన్నందువల్ల ఈ విమానాశ్రయం దేశం లో ని మిగతా ప్రాంతాలతో చక్కగా అనుసంధానం అవుతోంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed

Near by City