బాబింగ్టన్ పాయింట్ ప్రదేశం మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ ఆవరణలో కలదు. సుమారు 1294 మీటర్ల ఎత్తున కల ఈ అందమైన ప్రదేశాన్ని పర్యటకులు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చూడగలుగుతారు. ఈ ప్రదేశానికి వెళ్ళే మార్గమంతా పూర్తిగా పచ్చదనంతో ఎంతో మనోహరంగా ఉంటుంది.
ఇక్కడనుండి చైనామేన్ జలపాతాలు, కోయినా వ్యాలీ ప్రదేశాలు రెండూ చక్కగా కనపడతాయి.