ముంబై పాయింట్ లేదా సూర్యాస్తమయ ప్రదేశం పేరుకు తగినట్లు సూర్యుడు అక్కడి వ్యాలీలోకి దిగిపోవటాన్ని చూపుతుంది. సూర్యాస్తమయంలో అక్కడి ఆకాశంలో కనపడే వివిధ నారింజ రంగులు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ప్రదేశం మహాబలేశ్వర్ లో ఎంతో పురాతనమైంది. ఎంతో విశాలమైన ఈ ప్రదేశంలో మధ్యాహ్నాలు మంచి విశ్రాంతినిస్తాయి. సన్ సెట్ పాయింట్ సమీపంలోనే లవర్స్ పాయింట్ లేదా ప్రేమికుల ప్రదేశం కలదు.