అర్జునుడి తపస్సు అనేది అతిపెద్ద బహిరంగ ఏకశిల. దీనిని 7 వ శతాబ్దం మధ్య భాగంలో నిర్మించారు. సుమారు 43 అడుగుల ఎత్తులో వుంటుంది. దీనినే దిగివచ్చిన గంగ అనికూడా అంటారు. కొంతమంది ఇది అర్జున పేరుపై నిర్మాణం జరిగిందని అనగా మరికొందరు రాజు భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి పరచేందుకు ఇక్కడ గంగను స్వర్గం నుండి నేల మీదకు తీసుకు రావటానికి ఇక్కడ తపస్సు చేసాడని చెపుతారు.
ఇక్కడ చెక్కిన శిల్పాలు ఆనాటి శిల్పుల పని తనానికి ధ్రువపత్రాలు గా వుంటాయి. సుమారు వందకు పైగా దేముల్ల విగ్రహాలు, ఎగిరే ఖగోళ జీవాలు మరియు వైల్డ్ లైఫ్ చిత్రాలు ఇక్కడ కనపడతాయి. రెండు కొండల నడుమ గంగ నది భూమిపై కిందకు పడటం కనపడుతుంది. ఇది ఏక శిలను రెండు సగాలకు చేసినట్లు చూపుతుంది.



Click it and Unblock the Notifications