అనియతి సత్రం మజులి లోని మరొక ప్రసిద్ధ సత్రం. దీనిని నిరంజన్ పాథక్ దేవ్ 1653 లో స్థాపించారు. అనియతి సత్రం పాలనం, అప్సర నృత్యాలకు ప్రసిద్ధి. సత్రం లోని ఎంతో ప్రాముఖ్యత ఉన్న ధార్మిక పండుగలలో పాలనం ఒకటి. దీనిని నవంబర్ నెలలో జరుపుకొంటారు. సత్రం లోని ప్రధాన ప్రార్ధన మందిరంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్ధనలు జరుగుతుంటాయి. ఈ సంప్రదాయం గత 350 ఏళ్ళ కాలంగా అప్రతిహతంగా జరుగుతూనే ఉంది.
ప్రధాన ప్రార్ధన మందిరం (నాం ఘర్) లో ఉన్న గోవింద దేవునికి ఇక్కడ ప్రదర్శించే సత్రియా నృత్యాన్ని అంకితం చేస్తారు. ఇక్కడ పాలనంతో బాటుగా, రాస్-లీలా, జన్మాష్టమి, హోలీ, బోహాగ్ బిహు (అస్సాం సంవత్సరాది) వంటి అనేక ఇతర ధార్మిక పండుగలు జరుగుతాయి.
అనియతి సత్రం అస్సాం వంటపాత్రలు, హస్తకళలు, ఆభరణాల వంటి విస్తృతమైన సేకరణను కల్గి ఉంది. పర్యాటకులు ఈ సత్రాన్ని దేమాజు, ఉత్తర లఖింపూర్ లోని లూట్-ఖబోలుఘాట్ నుండి చేరవచ్చు.



Click it and Unblock the Notifications