మజులి సత్రాలకు ప్రసిద్ధి, బెంగానాతి సత్రం అటువంటి ప్రసిద్ధ సత్రాలలో ఒకటి. ఇది సాంప్రదాయికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న విస్తృతమైన పురాతన వస్తువుల సేకరణకు నివాసం. శ్రీమంత శంకరదేవుని సవతి తల్లి మనవడు మురారిదేవ్ స్థాపించిన ప్రదర్శనా కళల ఉన్నత కేంద్రానికి కూడా బెంగానాతి సత్రం నివాసం. ఈ ద్వీపంలోని ఇతర సత్రాలలానే బెంగానాతి సత్రం కూడా శ్రీమంత శంకరదేవ సంప్రదాయాన్ని, విలువలను పరిరక్షించడమే కాక, ప్రాచీన కళాకృతులను భద్రపరిచే మ్యూజియంగా కూడా ఉపయోగపడుతుంది.
అహోం రాజు స్వర్గదియో గదాధర్ సింఘాకు చెందిన రాచరిక పొడవు అంగీ ఈ సత్రంలోని అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. ఈ బంగారపు పొడవాటి అంగీతో బాటుగా అహోం రాజుకు చెందిన ఇతర వస్తువులలో బంగారపు గొడుగు కూడా ఉంది. విలువైన ఈ రెండు వస్తువులను ఇక్కడ భద్రపరిచారు.
బెంగనాతి సత్రానికి ప్రయాణించడానికి, జోర్హాట్ లోని నిమతి ఘాట్ నుండి మజూలి వరకు ఫెర్రీలో చేరవలసి ఉంటుంది.



Click it and Unblock the Notifications