మాల్పేలో దరియా బహదూర్ గడ్ ద్వీపం ప్రసిద్ధి గాంచినది. ఉడుపి జిల్లాలోని మాల్పే బీచ్ లకు ద్వీపాలకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు మాల్పేలోని ఈ దీవిని చూస్తారు. దరియా బహదూర్ గడ్ కోట ఇదే ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం 250 గజాలు. వెడల్పు 1.6 చ. కి.మీ. మాత్రమే. చిన్నదైనప్పటికి దీనిలో చాలా చూడదగిన సుందర ప్రదేశాలున్నాయి.పురాతన టైల్ ఫ్యాక్టరీ, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కూడా ఈ కోట దగ్గరలో ఉన్నాయి. చాలా దశాబ్దాల క్రిందట బిడనూర్ కు చెందిన బసవప్ప నాయక్ ఈ కోటను నిర్మించాడు. ఈ కోట మాల్పే బీచ్ కు పడమర దిశగా కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఉడుపి రైల్వే స్టేషన్ చేరితే చాలు దరియా బహదూర్ గడ్ కోట చేరటం తేలిక. మాల్పే పట్టణం నుండి దరియా బహదూర్ ఘడ్ కు బోట్ సర్వీసు ఉంది. బోట్ అద్దె కూడా తక్కువే. ఉడుపి నుండి రోడ్డు ప్రయాణ సౌకర్యం కూడా ఉంది.



Click it and Unblock the Notifications