ఇసుకరాయి దేవాలయాలకు, సహజమైన సరస్సులకు ప్రసిద్ది చెందింది మనాలి లో ఉన్న వశిస్ట్ విలేజ్. మనాలి నుండి 6 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ విలేజ్ రవి నది ఒడ్డున ఉంది. ఈ గ్రామం లో ఉన్న సహజ మైన సరస్సులలో చర్మ వ్యాధులని నయం చేసే ఔషద గుణాలున్నాయని అంటారు. హిందువుల పురాణం గాధల ప్రకారం, రాముడి తమ్ముడు లక్ష్మణుడి చే వేడి సల్ఫర్ కొలనులు ఈ గ్రామం లో రుపుదిద్దుకున్నాయని అంటారు.
ఈ కొలనులో ప్రభుత్వం వారు స్త్రీ మరియు పురుషులకు విడివిడిగా స్నానమాచరించే వసతులని కల్పించారు. నగరం నది బొడ్డు నుండి 10 నిమిషాల నడకతో ఈ హాట్ బాత్ కాంప్లెక్స్ కు చేరుకోవచ్చు. ఈ కొలను కి సమీపంలో, సింహపు చర్మాన్ని ధరించిన ఒక రిషి యొక్క నల్ల రాతి విగ్రహం యొక్క ఆలయాన్ని గమించవచ్చు.
హిందూ దైవం విష్ణు మూర్తి ఏడవ అవతారం అయిన రాముడికి, అలాగే కళా గురు కి అంకితమివ్వబదిన పుణ్యక్షేత్రాలు ఈ వశిష్ట విలేజ్ లో ఉన్నాయి. రాముడి గుడిలో రాముడు, సీతా మరియు లక్ష్మణుల విగ్రహాలను గమనించవచ్చు.
ప్రసిద్ద జానపద కథల ప్రకారం, హిందూ మతం లో గొప్ప వారైనా సప్త ఋషులలో ఒకరైన వశిష్ట ముని తన పిల్లలు విశ్వామిత్ర అనబడే మరొక రుషి చేత చంపబడ్డారని కలత చెందాడు. ఆ బాధలో ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా చనిపోవడానికి బదులు వశిస్ట్ గ్రామానికి కొట్టుకుని వెల్లబడ్డాడు. వశిష్ట మహామునిని ఈ గ్రామానికి తీసుకువెళ్ళిన నది పేరు విపాశ అంటే బంధాల నుండి విముక్తి చెందడమని అర్ధం. ఆ విపాస నదే ఇప్పటి బీస్ నది.



Click it and Unblock the Notifications