సముద్ర మట్టం నుండి 1350 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ రేవల్సర్ సరస్సు మండి లో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం మరియు పేరొందిన పర్యాటక మజిలీ. ఈ పుణ్యక్షేత్రం విశిష్టత ఏంటంటే ఇందులో మూడు బౌద్ద మఠాలు అలాగే మూడు హిందూ దేవాలయాలు ఉన్నాయి. 10 వ సిక్కు గురువు అయిన గోబింద్ సింగ్ ఇక్కడ ఒక నెల రోజులు గడిపారు కాబట్టి సిక్కులకి కూడా ఇది పవిత్రమైన క్షేత్రం.
ఇక్కడ ఉన్న బౌద్ధ మఠాలను బౌద్ధులు త్సోపేమా గా పిలుస్తారు. హిందూ దేవతలైన కృష్ణ మరియు శివుని ఆలయాలని లోమాస్ అని అంటారు. బౌద్ధ గురువు అలాగే తాంత్రికుడు అయిన 'గురు రింపోచ్', పద్మసంభవ ఇక్కడి నుండి టిబెట్ కి వెళ్ళారని పురాణ గాధలు చెబుతున్నాయి.
మండి నుండి 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ సరస్సు యొక్క సరిహద్దు 735 మీటర్లు. ఫిబ్రవరి చివరలో లేదా మార్చ్ నెల మొదట్లో జరిగే సిసు ఫెయిర్ ఇంకా బైసఖి వేడుకలకి రేవల్సర్ ప్రసిద్ది. ఈ పండుగ రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు.



Click it and Unblock the Notifications