మణికరణ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న పుల్గా ఇక్కడి మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ప్రకృతి స్వర్గంగా ఎంతోమంది చేత భావించబడే ఈ ప్రదేశం చుట్టూ పైన్ చెట్ల అడవులతోను, పర్వతారోహణ మార్గాలతోను చుట్టుబడి వుంటుంది. పర్వతారోహణ చేయాలనుకునే యాత్రికులకు ఈ 16 కిలోమీటర్ల దారి వెంట 1600 మీటర్లు ఎక్కే అవకాశం వుంది. ఈ మార్గం పుల్గా ను కసోల్ ను కలుపుతుంది. యాత్రికులు మణికరణ్ కు, ఖీర్ గంగా కు కూడా పుల్గా నుంచి పర్వతారోహణ చేయవచ్చు. ఇక్కడ చుట్టూ పచ్చటి మైదానాలతో వున్న ఒక విశ్రాంతి గృహంలో యాత్రికులు సేద తీరవచ్చు.